Share this:
  • సింగిడి కథనంతో టీచర్లలో స్పందన
  • తమ గోడు వెళ్లబోసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న టీచర్లు
  • నాణేనికి ఒకవైపే చూసి జడ్జ్ చేయొద్దు
  • ఫెయిల్ అనే క్షోభతో నరకయాతన!
  • సింగిడి యాజమాన్యం భేష్ అంటున్న నెటిజన్లు
  • టెట్ లోపాలు ఇప్పుడే గుర్తొచ్చాయా అంటూ టీచర్లను ప్రశ్నిస్తున్న సామాన్యులు
  • ఆత్మరక్షణలో ఉపాధ్యాయ సంఘాలు

పోరగాండ్లకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతుల్లే పరీక్షలల్ల (tet) ఫెయిల్ అయిర్రు అనే ముచ్చటని అన్ని వార్లలలెక్క కాకుండా అందులోని లోతును, భవిష్యత్ లో దాని వల్ల కలిగే దుష్పరిణామాలను సింగిడి గుర్తించింది. ఈ సమస్యను ఇలా వదిలేయకూడదని నిర్ణయించుకుని.. అక్షర రూపంలో యుద్దం మొదలుపెట్టింది. టీఆర్పీలు, సర్క్యులేషన్లు అంటూ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు ఇందులోని లోతును అందిపుచ్చుకోలేకపోయాయి. కానీ నూతన ఒరవడితో సమాజ శ్రేయస్సు కొరకే కంకణం కట్టుకున్న సింగిడి మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇది చూసి అంతా తొలుత అయ్యో భగవంతుడా అని అనుకున్నరు. కానీ దీంతో కొంత మంది తమకు జరిగిన అన్యాయం ఇది అంటూ ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక్కడ సింగిడికి కావాల్సింది (tet) సెన్సేషన్స్ కాదు సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం మాత్రమే సింగిడి ధ్యేయం. అందుకోసమే వారికి జరిగిందని వారు ఎలుగెత్తి చెబుతున్న సమస్యలను కూడా సింగిడి వివరిస్తూ కథనం ప్రచురిస్తుంది. కావున సింగిడి కేవలం ప్రజల పక్షమే అనే విషయం మరోసారి రుజువైంది. ఎవరు ఎన్ని రకాలుగా అన్యాయం జరిగింది, ఇలా జరిగింది అని ఆరోపణలు చేసినా, పోస్టులు చేసినా నిజం నిగ్గు తేల్చాల్సింది మాత్రం సంబంధిత అధికారులు మాత్రమే. ఆ నిజం బయటికి వస్తుందని ఆశిస్తూ..

హైదరాబాద్ (సింగిడి) జూలై 15: టీచర్ అంటే అదో ప్రొఫెషన్ అనే కన్నా ఓ సేవ అనుడు మంచిగుంటదేమో. సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఉపాధ్యాయ లోకం. కానీ నేడు ఆ ఉపాధ్యాయ లోకం తీవ్ర మానసిక ఆందోళనకు, ఆవేదనకు గురవుతోంది. ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు వెలువడిన తర్వాత ఆ ఫలితాల్లో చాలా మంది ఉపాధ్యాయులు పాస్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో ఉపాధ్యాయుల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే కొన్ని పత్రికలు అసలు సమస్యను నలుగురికి తెలియజేప్పే ప్రయత్నం చేస్తే కొన్ని మాత్రం ఉపాధ్యాయులపై బురద చల్లాయి. అటువంటి కథనాలు, వ్యాఖ్యల వల్ల కొంత మంది ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురయ్యారట. అటువంటి అనుచిత వ్యాఖ్యలను, కథనాలను సింగిడి ఖండిస్తోంది. అసలు ఇటువంటి సమస్య ఉత్పన్నం అయింది అని నలుగురికి చాటి చెప్పిందే సింగిడి. సమస్యను చాటిచెప్పిందే కానీ ఎక్కడ కూడా ఉపాధ్యాయులను సింగిడి యాజమాన్యం చులకన చేయలేదు.

అసంబద్ధ సిలబస్.. ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి!


ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ నిర్వహిస్తున్న టెట్ సిలబస్ రూపకల్పనలో తీవ్రమైన లోపాలున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు తాను నిపుణుడైన సబ్జెక్టులో కాకుండా, తనకు సంబంధం లేని సబ్జెక్టులపై పరీక్ష రాయాల్సి రావడం ముమ్మాటికీ అన్యాయమే అని వారు వాదిస్తున్నారు. పాఠశాలల్లో హిందీ బోధించే ఉపాధ్యాయులకు టెట్‌లో ‘సోషల్ స్టడీస్’ను ప్రధాన సబ్జెక్టుగా ఇచ్చి పరీక్ష నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. నిత్యం భాషను బోధించే వారు, సాంఘికశాస్త్రంలో లోతైన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా జీవశాస్త్రం (బయాలజీ) బోధించే ఉపాధ్యాయులకు గణితం (మ్యాథ్స్) అంశాలపై ఎలా పట్టు ఉంటుందనేది వారి వాదన. ఒక డాక్టర్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి గణితంలో పరీక్ష పెట్టడం, లేదా ఒక ఇంజనీర్ ప్రతిభను బేరీజు వేయడానికి సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించడం ఎంత తప్పు పద్ధతో ఇలా ఉపాధ్యాయులకు సంబంధం లేని సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించడం కూడా అన్యాయం అని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా నిపుణులను వారి సొంత సబ్జెక్టులోనే పరీక్షిస్తారు కానీ, ఇలా సంబంధం లేని సబ్జెక్టులతో కాదని ఇకనైనా టెట్ పద్ధతిని మార్చాలని సూచిస్తున్నారు.

విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలి! (tet)


తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఈ తీవ్రమైన సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని, వెంటనే వారు స్పందించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఉపాధ్యాయులను నిరంతరం పరీక్షల పేరిట ఒత్తిడికి గురిచేస్తూ, సమాజంలో వారిని చులకన చేసే ఈ విధానానికి స్వస్తి పలకాలని, ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఏ సబ్జెక్టు అయితే బోధిస్తున్నారో, ఆయా సబ్జెక్టుల ప్రాతిపదికగానే టెట్ సిలబస్‌ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల తరహాలోనే ఇక్కడ కూడా టెట్ క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని తగ్గించి, అందరికీ సమన్వయం చేయాలని సూచనలు చేస్తున్నారు.

ఈ మార్పులు చేయనంత కాలం.. పరీక్షలు జరుగుతూనే ఉంటాయి, ఉపాధ్యాయులు సాంకేతిక కారణాలతో ఫెయిల్ అవుతూనే ఉంటారని, పత్రికల్లో కథనాలు వస్తూనే ఉంటాయని వారు అంటున్నారు. క్రమంగా ఇది విద్యా వ్యవస్థకే తీరని నష్టం అని వాపోతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, విద్యా ప్రమాణాలు పెంచేలా టెట్ పరీక్షా విధానాన్ని తక్షణమే సంస్కరించాలి.

‘సింగిడి’ ప్రచురించిన కథనం..

https://epapersingidi.com/view/49/telangana

tet

Read now: https://singidinews.com/hydra-effect-in-hyderabad/

సంబంధం లేదని ఇప్పుడే గుర్తొచ్చిందా?

ఈ పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఒక ప్రశ్న తలెత్తక మానదు. టెట్ పరీక్షలో లోపాలున్నాయని అంతా విమర్శించిన తర్వాతనే టీచర్లకు గుర్తుకొచ్చిందా. టెట్ పరీక్ష తెర మీదకి వచ్చినపటి నుంచే ఈ వాదనలను ఎందుకు చేయలేదు. టీచర్లు ఇలా ఫెయిల్ అయ్యారని సింగిడి వెలుగులోకి తెచ్చిన తర్వాతనే వారికి లోపాలు గుర్తుకొచ్చాయా? అని అంతా చర్చించుకుంటున్నారు. నిజమేంటో ఆ భగవంతుడికే తెలియాలి. పరీక్ష పెట్టింది వాస్తవం, ఉపాధ్యాయులు ఉత్తీర్ణులు కాకపోవడం మాత్రం వాస్తవం. మరి ఈ ఇష్యూ మీద అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Share this: