Share this:
  • మోస్ట్ అండర్‌రేటెడ్ ప్లేయర్‌గా రోహిత్
  • ట్రోఫీలెన్ని అందించినా కీర్తించబడని వైనం
  • కొందరికంటే రోహిత్ తక్కువనే వ్యాఖ్యలు
  • ఏండ్లుగా రోహిత్ పై విషం కక్కుతున్న ఓ వర్గం

(Rohit Sharma) టీ 20 వరల్డ్ కప్, ఆసియా కప్స్, చాంపియన్స్ ట్రోఫీ ఇలా అన్నీ అందించినా కానీ రోహిత్ శర్మ కెపాసిటీపై కొంత మందికి అనుమానం. రోహిత్ అసలు ఫిట్ గా లేడని తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇక రోహిత్ కు ఇదే సిరీస్ అంటూ లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తుంటారు. హిట్ మ్యాన్ ఆ తప్పుడు ప్రచారాలకు ఎప్పుడూ రియాక్ట్ అవలేదు. ఆ అనుమానాలను తన బ్యాటుతోనే పటాపంచల్ చేస్తూ వస్తున్నాడు. ఈ సారి ఏకంగా ఓ అడుగు ముందుకేసి లార్డ్స్ లో రోహిత్ రిటైర్మెంట్ పక్కా అయిపోయింది. రోహిత్ కుటుంబం కూడా అక్కడకు చేరుకుందని ప్రచారం చేశారు. అయినా కానీ రోహిత్ శర్మ మాత్రం తనకు అలవాటైన సైలెంట్ ను మెయింటేన్ చేస్తూ తన బ్యాటుతోనే విమర్శకుల నోళ్లు మూయించారు. ఇన్నేండ్ల ఇండియన్ క్రికెట్ వన్డే హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని సెంచరీ ఫీట్ ను లార్డ్స్ లో కంప్లీట్ చేశారు. టీంలో ఏ ఆటగాడు ఆడని విధంగా ఆడినా కానీ రోహిత్ పై రిటైర్మెంట్ రూమర్స్ ఆగవు. నెక్ట్స్ సిరీస్ లకు కూడా ఇవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి కావొచ్చు. మనం ఇంగ్లండ్ మీద సిరీస్ ఓడిపోయినా కానీ రోహిత్ క్లాస్ ఇన్నింగ్స్ మాత్రం ఫ్యాన్స్ మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

లార్డ్స్‌లో రోహిత్ రిటైర్మెంట్ పక్కా!

లార్డ్స్ వన్డేలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పక్కా అని… అతడు 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో లేడని చాలా మంది ప్రచారం చేశారు. కొన్ని పేరెన్నికన్న మీడియా సంస్థలు కూడా రోహిత్ రిటైర్ అవుతాడని పని కట్టుకుని ప్రచారం చేశాయి. కానీ రోహిత్ మాత్రం ఆ ఊహాగానాలకు ఎప్పటి లానే తన బ్యాటుతోనే సమాధానం చెప్పారు. క్రికెట్ మక్కా లార్డ్స్ లో ఇన్ని సంవత్సరాల పాటు ఏ ఇండియన్ బ్యాటర్ కూడా సాధించలేని ఫీట్ నమోదు చేశాడు. పిచ్ పరిస్థితులు సవాలు విసురుతున్నా మాత్రం రోహిత్ ఏ మాత్రం నెమ్మదించలేదు. ఓ ఎండ్ లో కెప్టెన్ గిల్ ఔట్ అయినా కానీ రోహిత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. తనకు మాత్రమే అలవాటైన రీతిలో తన స్టైల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. రోహిత్ సెంచరీ చేసినా కానీ కొంత మంది ఏడుపు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

కోహ్లీ పక్కన కూర్చున్నాడంట కన్ఫామ్ అంట..

ఎటువంటి రూమర్స్ వచ్చాయంటే వాటిని చూస్తేనే నవ్వు రావడం పక్కా అనిపించేలా ఉన్నాయి. ఒక వీడియోలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా పక్కపక్కన కూర్చున్నారు.

Read More: https://singidinews.com/mhbd-sp-dr-sabarish-felicitates-adventurer-bhukya-yashwanth-naik/

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ సమయంలో కూడా అలాగే జరిగిందంట. అతడు రిటైర్ అయ్యే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ కూర్చుని మాట్లాడంట. ఈ సారి రోహిత్ పక్కన కోహ్లీ కూర్చున్నాడు గనుక రోహిత్ కూడా రిటైర్ అవుతాడని అంతా అన్నారు. కానీ రోహిత్ వారి ఊహాగానాలను తారుమారు చేస్తూ సెంచరీతో చెలరేగాడు.

మా ఫేవరేట్ ‘రోహిత్ గురునాథ్ శర్మ’ సారూ..

rohit sharma

ఇండియన్ క్రికెట్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ‘రోహిత్ గురునాథ్ శర్మ’ అని అంతా చెబుతారు. ఈ రోహిత్ గురునాథ్ శర్మ ఎవరు అని అంతా డౌటనుమాన పడుతున్నరుల్లా. మన హిట్ మ్యాన్ పేరే ‘రోహిత్ గురునాథ్ శర్మ’ ఫ్యాన్స్ ముద్దుగా అతడిని హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. రోహిత్ శర్మ మీదే ఇలాంటి రూమర్స్ వచ్చుడు కామనే అయినా ఈ సారి మాత్రం ఆ రూమర్స్ శృతి మించాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ కొంత కలవరానికి గురయ్యారు. తెలుగులో వచ్చిన పెద్ది సినిమాలోని డైలాగ్స్ ను రోహిత్ శర్మకు ఆపాదిస్తూ వీడియో ఎడిట్ చేశారు. ఆ వీడియో చూస్తే రోహిత్ విలువేంటో తెలియడం పక్కా.

ఎదురొడ్డి నిలిచిన యోధుడు హిట్ మ్యాన్

రోహిత్ శర్మ అన్నింటికి ఎదురొడ్డి నిలిచాడని ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వన్ మ్యాన్ అగేనెస్ట్ ఏజ్, సెలెక్టర్స్, మీడియా, రిటైర్‌మెంట్ అని ఆ పోస్టులో ఉంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ఆ పోస్ట్ చూసేయండి.

Share this: