Share this:
  • నగరపాలక సంస్థ కమిషనర్, మేయర్ ఇద్దరూ వివరణనివ్వాలి…
  • అబ్దుల్ రెహమాన్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ మాజీ అధ్యక్షులు

వినా స్త్రీయా జననం నాస్తి (స్త్రీ లేనిదే జననం లేదు)
వినా స్త్రీయా జీవం నాస్తి (స్త్రీ లేనిదే జీవం లేదు)
వినా స్త్రీయా గమనం నాస్తి (స్త్రీ లేనిదే గమనం లేదు)
వినా స్త్రీయా సృష్టిరేవ నాస్తి (స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు) అలాంటి స్త్రీ మూర్తుల మీద నేడు జరుగుతున్న అఘాయిత్యాలు శోచనీయం. అఘాయిత్యాలతో పాటు లైంగిక వేధింపులు కోకొల్లలు. అటువంటి లైంగిక వేధింపుల కథే ఇది.

సింగిడి సెంట్రల్ డెస్క్:

కరీంనగర్ (సింగిడి): కరీంనగర్ (KNR) నగర పాలక సంస్థలో పని చేసే ఓ మహిళా ఉద్యోగినిని ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు అనేకానేక రకాలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి ఇటీవలే మరణించాడు. దాంతో ఆ ఉద్యోగం అతని భార్యకు వచ్చింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటి బిగువున బాధను దాచుకుని ఉద్యోగానికి వస్తున్న ఆ మహిళకు మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇద్దరు నరరూప రాక్షసులు ఎదురుపడి.. ఆమెకు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. అరే ఆ మహిళ పుట్టెడు దు:ఖంలో ఉందనే ఇంగితం కూడా లేకుండా అదే పనిగా వేధింపులకు దిగుతున్నారు. రాను రాను ఆ ఆకతాయిల ఆగడాలు మరింత శృతి మించి పోయాయి. ఎలాగైనా లొంగదీసుకోవాలని ఉద్దేశంతో ఒకరికంటే మరొకరు ఎక్కువగా ఆ అబలపై లైంగికంగా వేధింపులు మొదలుపెట్టారు. ఏకంగా ఆఫీసులోనే ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బయటకు రావాలని ఫోన్ చేసి సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఆమె బయటికి రాకపోతే ఈ ఉద్యోగం పోతుందని బెదిరింపులకు కూడా గురి చేస్తున్నట్లు సమాచారం. మగ తోడు లేని ఆ మహిళను ఊరు చివరికి రావాలని, వచ్చి తమతో గడపాలని లేకుంటే ఉద్యోగం ఊడుతుందని అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తున్నారు కార్పొరేషన్ పరిధిలో SIR విధులలో ఉన్న ఆ మహిళను ఈ కామాంధుల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న పర్లేదు వచ్చి తమ లైంగిక వాంఛను తీర్చాలని ఒత్తిడికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోరేం..

knr

ఆ కామాంధుల ఆగడాలతో విసుగు చెందిన మహిళ చివరికి తనను వేధిస్తున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల పై చర్యలు తీసుకోవాలని ఈనెల 13వ తేదీన నగరపాల సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే కమిషనర్ విచారణకు కూడా ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మహిళలకు రక్షణ లేకపోవడం శోచనీయమని, దీనిపై సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ ఇద్దరు ఆపరేటర్లు దోషులని తేలితే వెంటనే వారిని జాబ్ నుంచి, అవసరం అయితే సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేయాలని, భవిష్యత్తులో ఇలా ఎవరు కూడా ఒక మహిళ మీద అఘాయిత్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ మాజీ అధ్యక్షులు.. అబ్దుల్ రెహమాన్ డిమాండ్ చేశారు.

మేయర్ సారూ చర్యలేడ?

ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కానీ ఎవరూ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. దేశం కోసం, ధర్మం కోసం అనే బీజేజీ పార్టీకి చెందిన నేత ప్రస్తుతం నగరపాలక సంస్థ మేయర్ గా ఉన్నారు. సదరు ఆపరేటర్లు మహిళా ఉద్యోగినిని వేధించినా, చివరికి ఆమె ఫిర్యాదు చేసినా కానీ మేయర్ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకొని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇటువంటి తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని అంతా కోరుతున్నారు.

Share this: