Share this:
  • రేవంత్ ది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన..!
  • రైతులను ఎదుర్కొనే దమ్ము లేదా..? : మెచ్చా

దమ్మపేట, జూలై 16(సింగిడి): (House Arrest)రైతుల సమస్యలపై నిలదీస్తారన్న భయంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపుమేరకు నిరసనకు సిద్ధమైన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను స్థానిక పోలీసులు తాటి సుబ్బన్నగూడెం గ్రామంలో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్యేనని, ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రుల దండు మణుగూరు వస్తుంటే, రైతుల సమస్యలపై ప్రశ్నిస్తారనే వణుకు ఎందుకు పట్టుకుందని, అధికారంలోకి రాకముందు ఆకాశం నుంచి అమృతం తెస్తామన్న కాంగ్రెస్ నాయకులు, తీరా గద్దెనెక్కాక రైతుల కష్టాలు అడిగితే పోలీసులతో అరెస్టులు చేయిస్తారా…? అంటూ విరుచుకుపడ్డారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మీరు ఇస్తున్న బహుమతి జైలు శిక్షలా..?ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజ్యాంగంపై కంటే లాఠీలపైనే నమ్మకం ఎక్కువైనట్లుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని పాలించడానికి నువ్వు ముఖ్యమంత్రివా? లేక నియంతవా రేవంత్ రెడ్డి..? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం తప్పైతే..ఆ తప్పును బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంటుందని, కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కొచ్చు అనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వంమని, మీ చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికే ఈ దిక్కుమాల్ని చర్యలకు పాల్పడుతున్నారని, ఎన్ని అరెస్టులు చేసిన ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని, 2సం.లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒకరికి సమాధానం కూడా ఇస్తామని, (House Arrest) ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.

Share this: