డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

నివాళులర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 14
మెదక్ జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమ వారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు
అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి
ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు




Post Comment