డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా పాదయాత్ర
టి పి సీ సీ అధ్యక్షులు ఆవుల రాజిరెడ్డి
గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి
.ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 14.
శివంపేట్ మండలం చిన్న గొట్టి ముక్కల కుడలి వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలతో నివాళులు అర్పించారు.
శివంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు చిన్న గొట్టిముక్ల ప్రధాన రహదారి నుండి గోమారం గ్రామం వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ లో భాగంగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. . చిన్న గొట్టుముక్కల పాదయాత్రలో భాగంగా చెన్నాపూర్ గోమారం గ్రామాలలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి విలేకరుల సమావేశంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం కల్పించిన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది
*సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం*

గోమారం గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు రాజు యాదవ్ ఇంట్లో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుమూల సువాసిని రెడ్డి, మరియు మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కలిసి భోజనం చేశారు. మండల సర్పంచుల పోరం మాజీ అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులకు కార్యకర్తలకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిలుముల సువాసిని రెడ్డి, శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, చింతల కర్ణాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు లక్ష్మీకాంతం, కమలాపూర్ సింగ్, బండారి గంగాధర్, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, సుధీర్ రెడ్డి, మరియు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.




Post Comment