ఘనంగా బండారి గంగాధర్ 45వ పుట్టిన రోజు వేడుకలు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 5.
జాతీయ సేవా రత్న అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ
సేవలు, మెదక్ జిల్లా కాంగ్రెస్ బీసీ నాయకులు బండారి గంగాధర్ 45వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నర్సాపూర్ నుండి పిలుట్ల గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బి జి ఆర్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. అనంతరం వీర శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరించారు. బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న బండారి గంగాధర్ పుట్టినరోజు సందర్భంగా పాట ను విడుదల చేశారు బిజిఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రముఖులకు సత్కరించారు.కులమతాలకు అతీతంగా హిందూ బహుజన సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ పటేల్, మెదక్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, వెంకటస్వామి,రేణుక, నందు, అంబేద్కర్ ఆజాద్ నరేందర్, ముక్తబాయి, శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్, కొడకంచి శ్రీనివాస్ గౌడ్ బి జి ఆర్ యువసేన సభ్యులు, బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment