Hyderabad Prepares To Host Miss World Pageantes
ప్రజా సింగిడి,కామారెడ్డి. మే, 5
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్టును తీర్చిదిద్దారు.
తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక లాంజ్ లతో పాటు, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.
అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా (Must Visit Telangana) నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు




Post Comment