Ex-Minister జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం అప్రజాస్వామీకం..!
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం అప్రజాస్వామీకం..!
◆బిఆర్ఎస్ పార్టీ నిరసన ర్యాలీ
(ప్రజా సింగిడి ప్రతినిధి జహీరాబాద్ మార్చ్ 15 సంగారెడ్డి జిల్లా:)
జహీరాబాద్, నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు
మాజీ,మంత్రి,సూర్యాపేట జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు,కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు స్థానిక శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పిలుపు మేరకు జహీరాబాద్ నియోజకవర్గం పార్టీ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.పేరుకేమో ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటూ ఆరు గ్యారంటీలు ఇస్తామని ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజల తరఫున మాట్లాడే మా పార్టీ శాసన సభ్యుల గొంతు నొక్కడం ఏమిటి’ అని ప్రశ్నించారు.తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బీఆర్ఎస్ శాసన సభ్యుడు జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనని మాటలు అన్నట్టు ఆరోపించి అబద్ధాల ఆధారంగానే జగదీశ్ రెడ్డి ని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఉంటే మా ఆటలు సాగవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని దెప్పిపొడిచారు.పథకం ప్రకారమే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అని విమర్శించారు. ‘ప్రశ్నిస్తే కేసులు,అక్రమ అరెస్టులు,సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కటం,సస్పెండ్ చేయటం ఇదేనా ప్రజా పాలన?’ అని నిలదీశారు సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,
సీనియర్ నాయకులు నామ రవికిరణ్, న్యాల్కల్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు బాస్కర్,పట్టణ మాజీ అధ్యక్షులు యాకుబ్,కేతకి ఆలయ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల , అనుషమ్మ ,బిఅర్ఎస్వి అధ్యక్షులు రాకేష్ తాజా మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ వార్డ్ అధ్యక్షులు,ఉద్యమకారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు..




Post Comment