Encounter Specialist దయా నాయక్ కు ప్రమోషన్..
ఎన్ కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ కు ప్రమోషన్
ప్రజా సింగిడి, ముంబాయి, జులై 29:
మహారాష్ట్రలో ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’గా పేరొందిన దయా నాయక్ కు ఏసీపీగా ఉద్యోగోన్నతి లభించింది.
ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా ఏసీపీ లుగా ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు. 1990ల్లో ముంబయిలో అండర్వరల్డ్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు 80 మంది గ్యాంగ్స్టర్లను దయా నాయక్ ఎన్ కౌంటర్ చేసినట్లు సమాచారం. ఈయన స్ఫూర్తితో గతంలో హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.




Post Comment