×

ఉగాది పర్వదిన సందర్బంగా ఉత్తమ సేవ పురస్కర అవార్డు గర్వనీయం

*సైనికులు దేశం కోసం సేవ చేస్తే పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు*

 

*మున్సిపల్ సిబ్బందికి ఉగాది పర్వదిన సందర్భంగా ఉత్తమ సేవా పురస్కార అవార్డ్ ఇవ్వడం గర్వనీయం*

 

*వారి సేవలను గుర్తించి ఉగాది పురస్కార అవార్డ్ ప్రధానోత్సవము చేసిన తూప్రాన్ ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయం*

 

*తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి*

 

సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ తూప్రాన్, మార్చి, 29.

 

సైనికులు దేశం కోసం సేవ చేస్తే పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారని తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ సిబ్బందికి ఉగాది పర్వదిన సందర్భంగా ఉత్తమ సేవా పురస్కార అవార్డ్ లు తన చేతుల మీదుగా ఇవ్వడం గర్వించదగినదని వారి సేవలను గుర్తించి ఉగాది పురస్కార అవార్డ్ ప్రధానోత్సవము చేయడం తూప్రాన్ ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయం అని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ పట్టణాల్లో, పల్లెల్లో వీధులు శుభ్రంగా ఉండడానికి కారణం కేవలం పారిశుధ్య కార్మికులు మాత్రమే అని అలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికునికి స్టీల్ వాటర్ బాటిల్ ను తన వంతుగా ఉచితంగా అందిస్తానని పేర్కొంటూ అప్పటికప్పుడే ఒక మూడు నాణ్యమైన మిల్టన్ కంపెనీకి చెందిన స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. మిగతా వారికి ఇవ్వడానికి మున్సిపల్ కమిషనర్ కు అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి మాట్లాడుతూ విధినిర్వహణ లో పారిశుధ్య కార్మికులు పడుతున్న పాట్లు కృషి అభినందనీయమని ప్రతి పనికి ముందుండి సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం అని పేర్కొంటూ అలాంటి వారికి తూప్రాన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా సన్మాన పత్రం బహుకరించడం అందరూ మరింత బాధ్యతగా వ్యవహరించి ఉత్తమ సేవలు అందిస్తారని తెలిపారు. తూప్రాన్ ప్రెస్ క్లబ్ నాయకులు వార్తల సేకరణలో ఎంతో బిజీగా ఉన్నా ఇంత మంచి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి పారిశుధ్య కార్మికుల సేవలు గుర్తించి చిరకాలం నిలిచే సర్టిఫికెట్ అందజేయడం వారి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మండుటెండలో సైతం నిలిచి ప్రజలకోసం అహర్నిశలు చేస్తున్న కృషి సేవా అభినందనీయమని వారి సేవలను శ్లాఘించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠాయపాలెం వేణుగోపాల్, భాస్కర్ గౌడ్ లు ఒకరోజు ముందు వారి ధృడ సంకల్పంతో ముందుకు వచ్చి అమలు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠాయపాలెం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి జీ. భాస్కర్ గౌడ్, ముఖ్య సలహాదారు సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ లయన్ డాక్టర్ జానకిరామ్, సీనియర్ జర్నలిస్ట్ లు ఆర్.శివశంకర్ గౌడ్, పి.ఆంజనేయులు గౌడ్, పి.నగేష్ గుప్త, ఎస్.సందీప్ కుమార్, వి.శివ కృష్ణ గౌడ్, సర్గల స్వామి, జయపాల్ రాథోడ్, మచ్చ యాదగిరి, బాలసాయి హరిప్రసాద్, భూషణం చారి, కోవూరు శ్రీనివాస్ గుప్త లు పాల్గొనగా కార్యక్రమానికి అన్ని తానై నడిపించిన సీనియర్ జర్నలిస్ట్ కడిమే మోజెస్ తోపాటు మున్సిపల్ మేనేజర్ ఏ.రఘువరన్, మధు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!