విధ్యతోనే భవిష్యత్తుకు బంగారు బాట- మాజీ సర్పంచ్ సిలువేరి లక్ష్మయ్య
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 28.
శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విధ్యార్థులకు మాజీ సర్పంచ్ సిలువేరి లక్ష్మయ్య తన మనమరాలు శ్రీవల్లి పుట్టినరోజు సందర్బంగా పరీక్ష ప్యాడ్లు,పెన్నులు బహుకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు విధ్యతోనే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని, విద్యార్థులు శ్రద్ధాసక్తులతో విద్యనబ్యసించి మంచి ఉన్నతస్థానంలో నిలిచి తల్లితండ్రుల పేరు చదువుకున్న పాఠశాల పేరు పుట్టిన ఊరుపేరు నిలబెట్టాలన్నారు. గతంలో తను సర్పంచ్ గా పనిచేసిన కాలంలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారి సహకారంతో పాఠశాల అదనపు గది నిర్మాణం కోసం కృషి చేశానని, అంగన్వాడీ భవనం నిర్మించానని తెలిపారు.భవిష్యత్తులో కుడా స్థానిక ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్రి గోపాల్ రెడ్డి , మాజీ ఉపసర్పంచ్ మర్రి నరేందర్ రెడ్డి , బిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం , బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఉప్పల జనార్ధన్ రెడ్డి , విద్యాకమిటి చైర్మన్ కుందేనపల్లి కృష్ణ , మాజీ వార్డు సభ్యులు గుర్రం సురేందర్ రెడ్డి , గుండు వేణు కుమార్ , నాయకులు గార్లపల్లి దర్మేందర్ రెడ్డి గారు,నిరుడి కృష్ణ గారు,కోట కృష్ణ ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయిలత ,పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




Post Comment