ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి
బేస్మెంట్ పూర్తి అయిన ఇండ్లకు చెల్లింపులు
హౌసింగ్ ఎండి వీ.పీ గౌతమ్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చ్ 28
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేసే దిశగ చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎండి విపి గౌతమ్ అధికారులను ఆదేశించారు.మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ పి.డి మాణిక్యం, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఈ. ఈ పి ఆర్ నరసింహులు, ఎల్ డి ఎం నరసింహమూర్తి, ,సంబంధిత ఎంపీడీవోలతో హౌసింగ్ ఎండి వీ.పీ గౌతమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో అధికారుల నుంచి జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి అన్ని వివరాలను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకొన్నారు. అనంతరం హౌసింగ్ఎండి వి.పి గౌతమ్ మాట్లాడుతూ దారిద్య రేఖకు దిగువన ఉన్నవారు కాబట్టి ఇందిరమ్మండ్ల లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ నుండి 500 స్క్వేర్ ఫీట్స్ వరకు ఇండ్లు నిర్మించుకోవచ్చు అని అదనంగా ఇంటి కొలతలతో తీసుకుని ఎక్కువ మొత్తంలో నిధులు ఉపయోగించి నిర్మించిన యెడల ఉపయోగముండదని దీనివల్ల అప్పులు బారిన పడే అవకాశం ఉందని ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలన్నారు గ్రామాలలో మేస్త్రీల ఇంటి నిర్మాణం, మెటీరియల్ తదితర విషయాల్లో సంబంధిత ఎంపీడీవోలు సలహాలు సూచనలు పాటించాలన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు నెలకొల్పాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా మెదక్ జిల్లాకు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జనవరి 26 రోజున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని మెదక్ జిల్లాలో 1242 ఇండ్లు మంజూరు కాగా వివిధ దశలలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రక్రియ ఏమాత్రం పెండింగ్ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, తెలిపారు. వెల్దుర్తి మండలం ధర్మారం క్షేత్రస్థాయి సందర్శన చేయడం జరిగిందని ఇందిర ఇండ్ల నిర్మాణ పురోగతిలో కొన్ని అంశాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం నాలుగు విడతల గా చెల్లింపులు చేస్తుందని మొదటి విడతగా బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఉగాది పండుగ అనంతరం మొదటి విడత నిధులు మంజూరు చేస్తామన్నారు మీ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు పై లబ్ధిదారులను అవగాహన కల్పించాలని ఇండ్ల పురోగతి వేగం పుంజుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే ఉన్నతాధికార దృష్టికి తీసుకురావాలని సమస్యలను పరిష్కరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ లోటుపాట్లను సవరించుకొని చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఇంకా వివిధ దశలలో పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయనే పూర్తి వివరాలను ఆయా ఎంపీడీవోలను అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందని , ఎంపీడీవోలతో సమావేశాలు నిర్వహించుకుని ఇందిరమ్మండ్ల నిర్మాణ ప్రక్రియ పురోగతి పై చర్యలు చేపడతామన్నారు. దారిద్యరేఖకు దిగువనున్న వారికి చేయూతని అందించే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీవోలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు




Post Comment