ప్రవేట్ యజమాన్యాలకు తొత్తుగా మారిన జహీరాబాద్ ఎంఈఓ ని సస్పెండ్ చేయాలి
ఎం సురేష్ పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 28 జహీరాబాద్
జహీరాబాద్ పట్టణం,శుక్రవారం రోజున స్థానిక ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా కమిటీ సమావేశాన్ని డివిజన్ కమిటీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది అనంతరం పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంలో ఇండస్ యూనివర్సల్ స్కూల్ యాజమాన్యానికి తొత్తుగా మారిన జహీరాబాద్ మండల్ ఎంఈఓ బస్వరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని గుర్తింపు లేకుండా ఇండస్ యూనివర్సల్ స్కూల్ సీబీఎస్సీ పేరుతో నడిపిస్తున్నారు పలుమార్లు దరఖాస్తు వినత పత్రం రూపంలో ఇచ్చిన పట్టించుకోవడం లేదు చివరికి ఈరోజు స్కూల్ లోనే నెక్స్ట్ అకాడమీ ఇయర్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్కులు నోట్ బుక్స్ డ్రెస్సులు షూస్ అమ్ముతున్నారని బుక్స్ సంబంధించిన ఎలాంటి బిల్లులు అడిగిన ఇవ్వకుండా అమ్ముతున్నారు అని కంప్లీట్ ఇచ్చిన పట్టించుకోవడం లేదు యజమాన్యానికి అడిగితే మాకు ఎంఈఓ పర్మిషన్ ఇచ్చారు మీరు ఏదైనా ఉంటే ఎంఈఓ కి అడగండి అని అంటున్నారు అంతేకాకుండా జహీరాబాద్ పట్టణంలో ఎలాంటి గుర్తింపు లేకుండా పల్లవి సీబీఎస్సీ స్కూల్ పేరుతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎంఈఓ మాత్రం నిద్రమత్తులో ఉన్నారు ఇలాంటి ఎంఈఓ ల వల్ల విద్యార్థుల జీవితాలు నాశనమయ్య ప్రమాదం ఉంది కనుక తక్షణమే వీధుల నుండి తొలగించి తగు చర్యలు తీసుకోవాలని ఇలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తున్న ఇండస్ యూనివర్సల్ పల్లవి స్కూల్ లా యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ జిల్లా నాయకులు ఏలియా. అనిల్ .దినేష్. సిద్ధార్థ్. మహేష్ అఖిల్. బన్నీ. కోటేశ్వరరావు సిద్దు సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు




Post Comment