సంగారెడ్డి జిల్లా పోలీసులు జగ్నికా రాత్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మార్చ్, 28.
సంగారెడ్డి జగ్నికా రాత్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగ్నికా రాత్ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు పికెట్స్, నైట్ బీట్స్ ఏర్పాటు. గురువారం మధ్యరాత్రి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ప్రైజ్ చెక్ నిర్వహించారు.పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు అందజేశారు. జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించే సంఘ విద్రోహ శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంతేకాకుండా, పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఎస్పీ ముస్లిం సోదరులతో ముచ్చటించి, వారి ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని మతాల పండుగలను ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని, ఒకరి మత సంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ మత సమరసాన్ని పెంపొందించుకోవాలని ఎస్, పి, సూచించారు




Post Comment