అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. మర్చి, 27.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి హత్నుర మండలం నుండి బయల్దేరిన మాజీ సర్పంచులు,మచ్చ విజయ లక్ష్మి-నరేందర్ మాజీ సర్పంచ్ సిరిపుర. మాధవి-నవీన్ గౌడ్ మాజీ సర్పంచ్ మధుర.బాయికాడి సుధాకర్ మాజీ సర్పంచ్ నాగుల్ దేవ్ పల్లి. హత్నూర పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా మచ్చ నరేందర్ మాట్లాడుతూ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేని ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తూ,పోలీసుల తో ముందస్తు అరెస్టులు చేయిస్తుందని దుయ్యబట్టారు.ఇకనైనా పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని సూచించారు.




Post Comment