పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 26 జహీరాబాద్
జహీరాబాద్ మండలం బాబా నగర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహోత్సవంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ, “హిందూ సంప్రదాయాలలో దేవతా విగ్రహ ప్రతిష్ఠ ఎంతో పవిత్రమైన కార్యక్రమం. గ్రామంలోని భక్తుల నమ్మకానికి, సామూహిక శక్తికి ఇది ప్రతీక. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి” అని ఆకాంక్షించారు.




Post Comment