పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈవో, వెంకటేశ్వర్లు
ప్రజా సింగిడి ప్రతినిధి, మర్చి 22జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం లోని
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సంగారెడ్డి జిల్లా డిఈఓ వెంకటేశ్వర్లు సందర్శించారు. శనివారం నాడు జహీరాబాద్ మొగుడంపల్లి మండలాల్లో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించి పలు సూచనలు సలహాలు అందించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాఫీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల సూచించారు. జహీరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కసాఫ్ గల్లి లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆర్ ఎల్ ఆర్ , జిల్లా పరిషత్ బాలికల హైస్కూలలో పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు విద్యార్థులకు క్రమశిక్షణగా చూడాలని వారి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించకూడదని తెలిపారుకేంద్రాలను ఆయన పరిశీలించి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.




Post Comment