24న పటాన్ చెరు లొ భారీ ఇఫ్తార్ విందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి పటాన్ చెరు. మార్చ్, 20.
పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రం లొ రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మతపెద్దల సూచనలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ భారీ సంఖ్యలో విధులకు హాజరైన కావాలని విజ్ఞప్తి చేశారు




Post Comment