×

నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్

నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్

– తప్పుడు ఆరోపణలతో మాపై బురద జల్లే ప్రయత్నం

– వాస్తవానికి తలా 17 గుంటల భూమి రావాలి

– అయినా మాకు మిగిలింది 12 గుంటల భూమి మాత్రమే

– అంతకు మించి ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా తీసుకోవచ్చు

ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్ మార్చ్ 19. తూప్రాన్

 

తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని రావెళ్ళికి చెందిన సర్వే నంబర్ 97/రు లో బూర్గుల వెంకటమ్మ కుటుంబానికి చెందిన ఐదుగురు తాతలు, తండ్రులకు సంబంధించి వారి వారసులకు వారసత్వంగా తలా 17 గుంటల భూమి రావాల్సి ఉండగా, నలుగురు వారసులకు మనిషికి 17 గుంటల భూమి యథాతథంగా ఉంది. కానీ వారి ఐదుగురు వారసులలో ఒకడైన బూర్గుల పాపిరెడ్డికి మాత్రం 12 గుంటల భూమి మాత్రమే ఉంది. కారణం పాపిరెడ్డికి చెందిన 17 గుంటల భూమిలో నుండి ఐదు గుంటల భూమి 44వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో పోయింది. దీంతో తనకు మిగిలి 12 గుంటల భూమిలో సుమారు గత 15 ఏళ్ళ క్రితం అప్పటి గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో ఓ ధాబాతో పాటు, మరో షెడ్డును నిర్మించారు. దీంతో డోర్ నెంబర్ 3-65/2/బి కేటాయించగా, డోర్ నెంబర్ 3-65/2/బి పార్ట్ గా రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీకీ ప్రతీ ఏటా పన్ను కూడా చెల్లిస్తున్నారు. అనంతరం 5 గుంటల భూమి మిగిలింది. పార్కింగ్ పోను, మిగిలిన భూమిలోంచి 4 గుంటల భూమి ని, 484 చదరపు గజాలగా నాలా కన్వర్షన్ చేసుకున్నారు. కాగా పాపిరెడ్డికి సోదరుడి వరస అయ్యే గోవర్ధన్ రెడ్డి కి ఉన్న 17 గుంటల స్థలానికి రోడ్డు లేకపోవడంతో ఎక్కడ రోడ్డు కొనుగోలు చేయాల్సి వస్తుందో అని డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ పేరిట గోవర్థన్ రెడ్డి అండ్ కో డ్రామాలు ఆడుతున్నాడని, ఇలా చేస్తే పరువు నష్టం దావా వేయడానికి సైతం వెనకాడమని, తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని, న్యాయం కోసం తాము ఎంతవరకైనా వెళతామన్నారు. ఏదైనా ఉంటే లీగల్ గా వెళ్ళాలి కానీ చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని బాధిత కుటుంబ సభ్యులు తూప్రాన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!