మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజా సింగిడి ప్రతినిధి జాహిరాబాద్. మర్చి, 19.
జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
2025 – 2026 సంవత్సర బడ్జెట్
పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైననే దృష్టి ప్రజల కష్టాల పైన ధ్యాస లేని బడ్జెట్ ప్రజాధనాన్ని పంచిపెట్టే కుట్ర ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జెట్ ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రంకెలు కాదు రేవంత్ రెడ్డి – అంకెలు ఎక్కడ పోయినై . ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది.
పరిపాలనకు చేతకాని ప్రభుత్వం
ఈ కాంగ్రెస్ ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలు గోవిందా, మహిళలకు 2500 గోవిందా,వృద్ధులకు 4000 పింఛన్ గోవిందా, విద్యార్థినిలకు స్కూటీలు గోవిందా ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావించలేదు.
తులం బంగారం గోవిందా, నిరుద్యోగ బృతి గోవిందా,
చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే ఇవాల చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో గురించి ప్రస్తావనే లేదు గొల్ల కురుమ యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు ముదిరాజ్ ల ముచ్చట లేదు వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు .
దళిత సోదరులను మోసం చేశారు అతి గతి లేని రైతు భరోసా సగం పూర్తి కానీ రైతు రుణ మాఫీ, నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు ఉద్యోగాలు ఇచ్చింది కెసిఆర్ ,
కాగితాలు ఇచ్చింది ఈ సన్యాసి ప్రభుత్వం.
విద్యా భరోసా గురించి ప్రస్తావన లేదు గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు




Post Comment