బీసీ గురుకుల బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ మార్చి, 18.
ఎం.జే.పి.టి. బీసీ వెల్ఫేర్ స్కూల్, కాలేజీ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి
జిల్లాలోని ఎంజేపీ మహాత్మ జ్యోతిబాపూలే, బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నర్సాపూర్ ఎం.జే.పి.టి. బీసీ వెల్ఫేర్ స్కూల్, కాలేజీ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి (రావెళ్లి) తెలిపారు. నర్సాపూర్ ఎం.జే.పి.టి. బీసీ వెల్ఫేర్ స్కూల్, కాలేజీ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి (రావెల్లి) మాట్లాడుతూ జిల్లాలోని బాలురు, బాలికల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 సంవత్సరంలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యా ర్థులు ఈనెల 31వ తేదీలోపు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేక్ష పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.




Post Comment