మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం – జహీరాబాద్ సమతా సైనిక్ దళ్ సభ్యులు
ప్రజా సింగిడి ప్రతినిధి జాహిరాబాద్. మర్చ్, 18.
జీహిరాబాద్ పట్టణo లో ఉన్న ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని మార్చి 31 వరకు అంబేద్కర్ విగ్రహం చుట్టూ టైల్స్, వాటర్ ఫౌంటెన్, గ్రిల్స్ జయంతి రోజు వరకు పూర్తిస్థాయిలో పూలతో మంచిగా అలంకరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని కోరడం జరిగింది. గత సంవత్సరం పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేస్తామని చెప్పి అర్ధాంతరంగా ముగించారు వారికి గుర్తు చేయడంతో ఈసారి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మార్చి 31 వరకు అన్ని మరమ్మతులను పూర్తి చేస్తామని సంబంధిత ఏఈ ని పిలిచి వర్క్ ఎస్టిమేషన్ ఏసి తొందరలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్, కోశాధికారి కొనింటి నర్సింలు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రేమ్ కుమార్ తదితరులు పాలుగోన్నారు




Post Comment