ఘనంగాఆంజనేయ స్వామి ధ్వజస్తంభ లింగం ప్రతిష్ట
ప్రజా సింగిడి ప్రతినిధి కౌడిపల్లి. మర్చి, 17.
కౌడిపల్లి మండలం కోట్టాల గ్రామము లో గ్రామపెద్దల ఆధ్వర్యంలో. శనివారం నుండి సోమవారం వరకు గత మూడు రోజుల నుండి గణపతి పూజ .దీపారాధన. హోమము. పూర్ణాహుతి .మంగళహారతులు తదితర కార్యక్రమాలు .సరస్వతి విద్యాపీఠం మహేశ్వరి శర్మ సిద్ధాంతి ఫసల్వాది పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మాణం. ధ్వజస్తంభ. గణపతి. లక్ష్మీదేవి.దుర్గాదేవి. వెంకటేశ్వర స్వామి. సూర్య భగవానుడు. శివలింగం. నందీశ్వరుడు. ధ్వజ శిఖరం. ప్రతిష్టాపన కార్యక్రమం,సోమవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి దేవాలయంలో నందీశ్వర స్వామి ప్రతిష్ట.హనుమాన్ దేవాలయం అంగరంగ వైభవంగా, రంగురంగుల లైట్లతోటి.పంచ్చని పందిర్ల తోటి సుందరంగా తీర్చిదిద్దారు. మరియు సుమారు 35 ఫిట్ల ధ్వజస్తంభ ప్రతిష్ట చేశారు. అనంతరం గ్రామ ఆడబిడ్డలు అందరూ నిడు బిందెతో దేవాలయం ముందు సాక పెంటడం మంగళహారతులతో ఎదుర్కోవడం జరిగింది. సకుటుంబ సమేతంగా దేవాలయ ప్రవేశం చేసి దర్శనం చేసుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం.గ్రామ పెద్దల సహకారంతో హనుమాన్ దేవాలయ అభివృద్ధి తోడ్పడిన దాతలకు జన్మజన్మల రుణపడి ఉంటామని గ్రామ పెద్దలు తెలియజేశారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




Post Comment