కాంగ్రెస్ లోకి భారి చేరికలు – ఆహ్వానించిన ఆవుల రాజిరెడ్డి
కాంగ్రెస్ లోకి భారి చేరికలు – ఆహ్వానించిన ఆవుల రాజిరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 16.
నర్సాపూర్ పట్టణంలోని ఏ ఆర్ ఆర్ క్యాంప్ కార్యాలయంలో నర్సాపూర్ పట్టణం 1వ వార్డ్, 2వ వార్డ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలో చేరికలు జరిగాయి. పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో నూతన సభ్యులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశేషమైన ఆదరణ పెరుగుతోందని, ఇది రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు సంకేతమని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ పార్టీ ధ్యేయమని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు.నూతన సభ్యులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకే ఉందని నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ సేవలను అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




Post Comment