ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ – రెండవ రోజు కార్యక్రమం నివేదిక
ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ – రెండవ రోజు కార్యక్రమం నివేదిక
ప్రజా సింగిడి ప్రతినిధి వరంగల్. ఫిబ్రవరి, 28.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (తూర్పు), వరంగల్ తూర్పు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ రెండవ రోజు కార్యక్రమాలు బొల్లికుంట గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భీమాణిక్య రేఖ గారు నాయకత్వం వహించారు. కమిటీ సభ్యురాలు డాక్టర్ ఎల్. హారతి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు గారు, AMC మాజీ డైరెక్టర్ తుమ్మ రవిందర్ రెడ్డి గారు, PACS మాజీ డైరెక్టర్ దొంతి వేమన రెడ్డి గారు, డివిజన్ యువ నాయకులు సొల్తీ నరేందర్ గారు, దాసరి క్రాంతి గారు తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. వారు మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ కూడా అత్యంత ముఖ్యమని తెలియజేశారు.
వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని శివాలయం పరిసర ప్రాంతంలో పలు రకాల మొక్కలను నాటారు. గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందడంతో పాటు సమాజ సేవ పట్ల విద్యార్థుల్లో మరింత బాధ్యతా భావం పెరిగింది.




Post Comment