ఘనంగా అక్షర విజేత క్యాలెండర్ఆవిష్కరన
ఘనంగా అక్షర విజేత క్యాలెండర్ఆవిష్కరన మండల ఆపద్బాంధవుడు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఫిబ్రవరి, 12.
శివంపేట మండల కేంద్రంలో అక్షర విజేత తెలుగు జాతీయ దినపత్రిక శివంపేట మండల ఆపద్బాంధవుడు, సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా శివంపేట గ్రామసర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ మరియు పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యుల సమక్షంలో అక్షర విజేత తెలుగు జాతీయ దినపత్రిక కేలండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైనది అని సమాజానికి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఆరధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. పత్రికలకు స్వేచ్ఛ చాలా ముఖ్యమని వివిధ పత్రికల్లో పని చేసే పాత్రికేయులు సమాజానికి అర్థం పడతాయని అక్షర విజేత నిష్పక్షపాత వార్తలతో ప్రజలకు చేరుకోవడం సంతోషకరము అని అన్నారు. నూతన సంవత్సరంలో అక్షర విజేత మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్, నూతన వార్డు సభ్యులు ఎస్ నరేష్, గ్రామ బి ఆర్ఎస్ అధ్యక్షులు ముదగల లక్ష్మీ నరసయ్య, తాజా మాజీ వార్డు సభ్యులు వంజరి కొండల్, బిజిలిపురం కృష్ణ, పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు ముద్దగల రాజు, లస్కరి స్వామి, డ్రైవర్ సాయి, కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, లంబడి రవి, తదితరులు అక్షర విజేత క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.




Post Comment