కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు నూతన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరువు పట్టణంలోసి.ఐ.టి.యు*
*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు నూతన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరువు పట్టణంలోసి.ఐ.టి.యు*
ప్రజా సింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 12
ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రాష్ట్ర సభ్యులు రాజయ్య వాజిద్ అన్న గారు, అలాగే వివిధ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్న ఈ లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని, కార్మిక వర్గం జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.




Post Comment