కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు నూతన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బి.ఆర్.టి.యు*
*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు నూతన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బి.ఆర్.టి.యు*
ప్రజా సింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 12
ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ నిర్వహించిన నిరసనగా బైక్ ర్యాలీలలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు నూతన లేబర్ కోడ్లు కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని
సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని,కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థిర ఉద్యోగాలను బలహీనపరుస్తున్నారని,
పరిశ్రమల్లో కార్మిక సంఘాల శక్తిని తగ్గించే కుట్ర జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన కార్మిక వర్గాన్ని అణగదొక్కడమే ఈ చట్టాల అసలు లక్ష్యమని ఆరోపించారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని స్పష్టం చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – కార్మికులే దేశ బలం!
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి , నర్రా బిక్షపతి , నాగమల్లేష్ , చంద్రశేఖర్ , ఎల్ ఎస్ యాదవ్ , ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు




Post Comment