సయ్యద్ ఆబేద్ హుస్సేన్ చిస్తి*ఉర్సు ఉత్సవాలు ప్రారంభం*
*సయ్యద్ ఆబేద్ హుస్సేన్ చిస్తి*ఉర్సు ఉత్సవాలు ప్రారంభం*
ప్రజా సింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 11 హత్నూర మండలం
మండల పరిధిలోని కాసాల గ్రామ శివారులో గలఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈనెల 17వ తేదీన హజ్రత్ సయ్యద్ ఆబేద్ హుస్సేన్ చిస్తి ఉర్సుఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కార్యనిర్వాకులు అన్వర్ తెలిపారు 17వ తేదీన సందల్ ముబారక్ గంధం ఉంటుందని 18వ తేదీన చిరాగ్ దీపారాధన కార్యక్రమం ఉంటుందని అలాగే తర్వాత రోజు 19వ తారీఖున కాత్మా ఖురాన్ జిహారతు పాతియా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అన్వర్ తెలిపారు ఈ ఉర్సు ఉత్సవాలకు కర్ణాటక హైదరాబాద్ తదితర రాష్ట్రాలతో పాటు వివిధ జిల్లాల నుండి కూడా భక్తులు పాల్గొంటారని తెలిపారు ఈ మూడు రోజులపాటు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు మూడు రోజులపాటు భక్తులకు రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనలని ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు




Post Comment