పూర్తి భద్రత నడుమ క్షేమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రీ*
*పూర్తి భద్రత నడుమ క్షేమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రీ*
*ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలి*
*ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్లరాదు*
*ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి*
*జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్*
ప్రజా సింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 10 సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది చేయవలసినవి, చేయకూడని విధులపై ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ.. ఉదయం 6:00 గంటల లోపే పోలింగ్ కేంద్రానికి 100, 200 మీటర్ల దూరంలో మార్కింగ్ చేయించుకోవాలని సూచించారు. ఓటర్లతో ఎవరూ సన్నిహితంగా మాట్లాడరాదని, ముందుగానే క్యూలైన్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్లు గుంపులుగా గుమిగూడకుండా చూడాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లయితే వెంటనే రూట్ మొబైల్ అధికారులకు, సీనియర్ అధికారులకు సమాచారం అందించాలని, కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ విలువైన ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని ఎస్పీ అన్నారు.




Post Comment