ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమి కబ్జా*
*ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమి కబ్జా*
*రెవిన్యూ అధికారులు చూసి చూడనట్టు*
*పేరుకే పేదల ప్రభుత్వం భూములు*
*ఏసీ రూములు ఫామ్ హౌస్లు*
*ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ బడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు*
ప్రజాసింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 10 హత్నూర మండలం
హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో 336 సర్వే నెంబర్లు లో ఉన్న అసైన్డ్ భూమిని కొన్న అమ్మిన వారిపై చట్టారీత్యా నేరం కేసులు నమోదు చేస్తామని గతంలో హత్నూర మండల తాసిల్దార్ తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ ..గతంలో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూములు ఆ భూములు ఎలా ఆక్రమించుకుంటారని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని పంట పండించుకోవడానికి మాత్రమే అన్నారు. నూతన భూ చట్టాన్ని ఆసరాగ ప్రాబ్బపాలతో మళ్లీ నూతన పట్టా పాస్ పుస్తకలతో రికార్డులోకి ప్రభుత్వ భూమి రికార్డు లోకి ఎలా మారుతాయి అని అంటున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు నేతల సహాయంతో చక్రం చెప్పి తప్పుడు పాత్రలతో తిరిగి రికార్డులోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమిని ఒక వ్యక్తి నోటరీ చేసుకొని అసైన్డ్ ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు గత కొంతకాలం నుండి భూములకు రెక్కలొచ్చిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం భూమి ఖాళీగా కనిపించిందా ఇక అంతే సంగతులు పక్క రికార్డులు మరో పక్క పేదల భూములు కబ్జా కోరల్లో ముంచేస్తున్నారు. కోట్లకు విలువ చేసే భూములను యదేచ్చగా కబ్జాకు గురి చేస్తున్నారు కొంతమంది దళారులు ఇప్పుడే అదే పరిస్థితి నెలకొన్ని కాసాల గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ప్రభుత్వం అధికారుల అండ దండలతో రాజకీయ నాయకుల ప్రమేయంతో యథేచ్ఛగా కబ్జా చేసి రుణములు నిర్మించి బిల్డింగ్స్ గ్రామపంచాయతీ పర్మిషన్లు లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసైన్మెంట్ పేరుతో కబ్జా చేయగా మరి కొంత మంది డూప్లికేట్ డాక్యుమెంట్ సృష్టించి ప్రభుత్వం భూములు పోగా వేశారు. దీనికి ప్రధాన సూత దారులు రెవెన్యూ ఆఫీసర్లు కారణం అంటున్న బహిరంగ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పలుమార్లు కంప్లైంట్ లు ఇచ్చిన పట్టించుకోని రెవెన్యూ యంత్రం గత ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూమి ప్రభుత్వ భూమి కేటాయించిన భూమి పట్టేదారి ఉన్నారా లేదా ఇతరులు ఉన్నారా అని చెప్పిన పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూములు అమ్మిన కొన్న చట్టరీత్యా నేరమని తేల్చి చెప్పిన ప్రభుత్వం అసైన్మెంట్ భూములు పట్టా గా ఎలా మారుతున్నాయని అన్నారు ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ లోపల డైరీ ఫార్మ్స్ బిల్డింగ్ కట్టుకోవడంతో చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటూ కాసాల గ్రామ ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం భూమిని భూమిని చర్చించి ప్రభుత్వం భూములో నిర్మించిన ఫామ్ హౌస్ ను తొలగించి వేయాలని గ్రామ ప్రజలు అంటున్నారు. నిర్మాణాలు చేసిన వారిపై చట్టరిత చర్యలు చేపట్టి కబ్జాకు గురైన ప్రభుత్వం భూమిని కాపాడాలని అంటూ కాసాలా గ్రామం ప్రజలు అధికారులను కోరారు




Post Comment