రిజర్వేషన్ కలిసొస్తే జడ్పీటీసీ గా పోటీచేస్తా..
రిజర్వేషన్ కలిసొస్తే జడ్పీటీసీ గా పోటీచేస్తా..
పూల వ్యాపారి రమేష్ తూర్పాటి
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. జనవరి, 09.
రానున్న స్తానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసొస్తే స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ బరిలో ఉంటానని, దౌల్తాబాద్ గ్రామానికి చెందిన పూల వ్యాపారి రమేష్ తూర్పాటి అన్నారు. ఈ సందర్భంగా రమేష్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో రానున్న స్తానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసొస్తే స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ బరిలో ఉంటా అన్నారు.తను పూల వ్యాపారి గా గత ఇరవై ఏళ్లుగా దౌల్తాబాద్ గ్రామ ప్రజలతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజల తో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.ఒక పూల వ్యాపారి గా మార్కెట్లో ఉన్న అందరికంటే తక్కువ ధరకే పూలు విక్రయాలుచేస్తూ సామాన్య ప్రజలకు చేరువయ్యాడు. ఈ విధంగా పూల వ్యాపారి గా మండలంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడనును కావున ప్రజలు తనను ఆదరిస్తారని అన్నాడు. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసొస్తే తప్పకుండా స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ బరిలో ఉంటానని తెలిపాడు.విద్యావంతులకు, అదేవిధంగా మండలంలో విద్యావంతులు, ఉద్యోగస్తులు, యువకుల తో తనకున్న సత్సంబంధాలు జడ్పీటీసీ గా నా గెలుపుకు దోహద పడతాయని రమేష్ ఆశా బావం వ్యక్తం చేశారు.




Post Comment