పెద్దాయపల్లిలో రూ,200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల ప్రారంభం
*పెద్దాయపల్లిలో రూ,200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల ప్రారంభం*
ప్రజాసింగిడి ప్రతినిధి రమేష్ బాలనగర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా.09 జనవరి 26.
*జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు శ్రీకారం*
సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో విద్యా రంగంలో కీలక ముందడుగు
మెగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాల భవనం నిర్మాణం
బాలనగర్ మండలంలోని పెద్దాయపల్లి సమీపంలో సుమారు రూ, 200 కోట్ల నిధులతో మెగా కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత సంవత్సరం ఆర్&బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు.జడ్చర్ల నియోజకవర్గానికి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు రూ,200 కోట్ల నిధులను ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.ఈ భారీ విద్యా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మెగా కంపెనీ చేపట్టిందని, రెండు సంవత్సరాల వ్యవధిలో నాణ్యమైన నిర్మాణ ప్రమాణాలతో పనులను పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం జడ్చర్ల నియోజకవర్గంలోని అనేకమంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని, విద్యా రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.విద్యాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు.




Post Comment