తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్‌పర్సన్‌గా డా. కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం
*తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్‌పర్సన్‌గా డా. కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం నియామకాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆరేళ్ళ యాదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపు*
ప్రజా సింగిడి ప్రతినిది రమేష్ బాలనగర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. 09 జనవరి 26.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)ఎస్సీ విభాగం చైర్‌పర్సన్‌గా మానకొండూర్ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణను నియమించేందుకు గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆమోదం తెలిపారు.ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ప్రకటించింది.ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే.సి. వేణుగోపాల్ అధికారిక ప్రెస్ రిలీజ్ జారీ చేశారు.ఈ నియామకంపై డా. కవ్వంపల్లి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన గౌరవ ఏఐసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.(టీపీసీసీ) పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల హక్కులు మరియు అభివృద్ధి కోసం పూర్తి బాధ్యతతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా, డా. కవ్వంపల్లి సత్యనారాయణకు లభించిన ఈ కీలక బాధ్యతను పురస్కరించుకుని గాంధీ భవనం వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని బాలానగర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అరేళ్ళ యాదయ్య విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో, మండల ఎస్సీ సెల్‌తో సమన్వయంతో విజయవంతంగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని అనుబంధ సంఘాలు, విభాగాలు, కార్యాలయాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి.ఈ కార్యక్రమంలో ఆరేళ్ళ యాదయ్య, వేపురి నర్సిములు, బైండ్ల ప్రభు, మొల్గర సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment