చైనా మాంజా వినియోగం నిషిద్ధం*
*చైనా మాంజా వినియోగం నిషిద్ధం**
వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు*
*హత్నూర మండలం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి*
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర జనవరి 9.
ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ఎస్సై తెలియజేశారు. చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…. కాసాల 12 వార్డులో ఫుట్ పాత్ పైన ఉన్న షాపులు చైనా మాంజా నిల్వలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వివిధ గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండేలా ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రాణ భద్రతకు సహకరించాలని సూచించారు. హత్నూర మండలంలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగించినట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.




Post Comment