భారీ వర్షాలకు నష్టపోయిన నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి
భారీ వర్షాలకు నష్టపోయిన నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి
-ముంపు ప్రాంతాలను పరిశీలించిన తాజా మాజీ కౌన్సిలర్ నర్సోజి.
ప్రజా సింగిడి తూప్రాన్, మెదక్ జిల్లా స్టాపర్,సెప్టెంబర్ 18
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాల కారణంగా నీటితో మునిగిన లోతట్టు ప్రాంతాలను బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ జమాల్పూర్ నర్సోజి గురువారం సందర్శించి పరిశీలించారు.తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని నర్సాపూర్ రోడ్ దేవి గార్డెన్,గాయత్రి నగర్,గ్యాస్ గోదాం పరిసర ప్రాంతాల్లో కాలనీ మొత్తం నీటితో మునిగిపోవడం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలను అలాగే 12 వార్డులో ఏబీ కాలనీలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు.అలాగే జక్కపురం నాగరాజుకు సంబంధించిన ఇళ్ళు కూలిపోవడంతో బాధితులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం భారీ వర్షాలకు జలమయమైన కాలనీలు కూలిపోయిన ఇళ్ల పరిస్థితులను తూప్రాన్ ఆర్.డి.ఓ జయచంద్రారెడ్డి అలాగే మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి లతో చరవాణి ద్వారా మాట్లాడి పరిస్థితులను వివరించారు.తక్షణమే మున్సిపాలిటీ పరిధిలో వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.వర్షాల కారణంగా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో మునిగిపోతున్న వివిధ ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వలు తొలగించే విధంగా తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నర్సోజీ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి రమేష్ పన్నీరు రాము బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రవి రాజిరెడ్డిత దితరులు ఉన్నారు.
Post Comment