నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోనా రైతులకు పునరావాసం కల్పించాలి,,
నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోనా రైతులకు పునరావాసం కల్పించాలి,,
అఖిలభారత ప్రధాన కార్యదర్శి , బి వెంకట్
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 14 సంగారెడ్డి జిల్లా
నిమ్జ్ పరిధిలో ఉన్న భూములు బలవంతపు భూసేకరణ ఆపాలనీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములిచ్చిన రైతులకు, వ్యవసాయ కూలీలకు పునరావాసం ఇవ్వాలనీ, భూములిచ్చిన రైతులకు ముచ్చర్ల ఫార్మా సిటీ, లగచర్ల లో ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇచ్చిన మాదిరిగా ప్రభుత్వం నిమ్జ్ లో రైతులకు కూడా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ భవన్ నుండి బస్టాండు మీదుగా నిమ్జ్ ఆర్.డి.ఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం నిమ్జ్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఆర్.డి.ఓ, జహీరాబాద్ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. వెంకట్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకట్రాములు, జిల్లా అద్యక్షులు బి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింలు, జహీరాబాద్ మండల అద్యక్షులు యస్. సుకుమార్, ఝరాసంగం మండలం అధ్యక్షులు చంద్రన్న, దశరధ్, సంగన్న, తుల్జారాం, నర్సింలు, శంకర్, బాలప్ప, జయమ్మ, సంతోష్, రాములు, పునీత్ కుమార్ దీక్షిత్, బుద్ధు, గ్రామాల నుండి వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
Post Comment