యూరియా కొరతపై కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు*
*యూరియా కొరతపై కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు*
*కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేదు*
*నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి*
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 10
నర్సాపూర్ నియోజకవర్గ
యూరియా కొరతపై కాంగ్రెస్ బిజెపిలు హై డ్రామాలాడుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఎక్కడ చూసిన రైతుల ధర్నాలు రాస్తారోకోలు కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన యూరియా లేక రైతులు అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఇరు పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఏరియా కొరత లేదని కృతమ కొరత స్పష్టిస్తున్నాయని సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో సెంటర్ పై మహిళలు రైతులు దాడి చేశారన్నారు. ముఖ్యమంత్రికి కళ్లుంటే నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. సీఎం మంత్రులు మాటలు తప్ప పనులు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాత రోజులు చేస్తామని చెప్పినట్లుగానే మళ్లీ ఆ రోజులు తీసుకొచ్చిందన్నారు. యూరియా పంపిణీ పోలీసులను పెట్టి ఎరువులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. పండ్లు తోముతున్నారా అని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలలో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారని మండపడ్డారు. రాష్ట్రంలో వర్షాకాలానికి 15 లక్షల టన్నుల యూరియా అవసరం కానీ కేంద్రం 8.32 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చిందన్నారు. అందులో వచ్చింది. 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రులు ఏమి తెలియనట్లే నటిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ హయాంలో ఎప్పుడు ఎరువుల కొరత రాలేదని తెలిపారు. కెసిఆర్ ఏప్రిల్ మే నెలలోనే ఎరువులపై సమక్ష జరిపేవారని తెలిపారు. అవసరమైన ఎరువులను ముందే బంపర్ స్టాక్ పెట్టించే వాళ్లని గుర్తుచేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేక పోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు.
Post Comment