విద్యార్థులు విద్యతొ పాటు క్రీడల్లో కూడా రాణించాలి.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 20 వేలు సొంత నిధులు అందజేసిన పిఎసిఎస్ చైర్మన్ !
చింతల వెంకటరామిరెడ్డి!!
.ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. సెప్టెంబర్, 02.
శివంపేట్ మండలం గోమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి హాజరయ్యారు.క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారి ప్రయాణ ఖర్చుల కోసం తన సొంత నిధుల నుండి అక్షరాలా 20,000 వేలు రూపాయలు అందజేశారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు క్రీడలలో రాణించడం గర్వకారణం. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం, జట్టు భావన పెంపొందుతాయి. రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లేలా మన విద్యార్థులు కష్టపడాలిఅని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మాధవ రెడ్డి, పాఠశాల సిబ్బంది, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment