డీఎస్పీని కలిసిన మెదక్ రైతు రక్షణ సమితి నాయకులు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. సెప్టెంబర్, 02.
తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్కమొల్ల మైసయ్య యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్‌కు శాలువా కప్పి సన్మానించారు. మైసయ్య యాదవ్ మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తన వంతు సహయ సహకారాలు రైతులకు ఎప్పుడు ఉంటుదని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, ముఖ్య సలహాదారులు మిరియాల చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బోయిన రమేష్ యాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి ఎంఎల్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బీ. మహేష్ నాయక్, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment