కాలేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫారసు చేయడం సిగ్గుచేటు
*ఘోష్ నివేదికను పక్కనపెట్టి సిబిఐ కి అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి?*
*తెలంగాణ అపర భగీరథుడు కేసీఆర్ గారిని బదునాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర*
*పల్లె ప్రజలకు మంచినీళ్లు ఇచ్చింది తప్పా?*
*బీడు భూములకు సాగునీళ్లు ఇవ్వడం నేరమా?*
*కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రజలంతా కేసీఆర్ ని తలుస్తున్నారు, ఇది కేసీఆర్ గొప్పతనం*
*రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిన నేతపై నిందలు వేయడం కాంగ్రెస్ కే చెల్లింది*
*కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు*
*కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మండిపాటు*
*షాద్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన*
*కాలేశ్వరం ప్రాజెక్టును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన నేతలు*
*సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహానం చేసి నిరసనలు తెలిపిన గులాబీ శ్రేణులు*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 రంగారెడ్డి జిల్లా*
తెలంగాణ బీడు భూములకు సాగునీళ్ళు కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిఫారసు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ కేసు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం షాద్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపిన అనంతరం మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఘోష్ కమిటీ నివేదికను పక్కనపెట్టి, కేవలం కేసీఆర్ ను బదునాం చేయాలనే ఉద్దేశంతో, దిక్కుమాలిన, కుట్రపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయిన తెలంగాణ ప్రాంతం కేసీఆర్ పాలనలోనే ప్రగతి వైపు నడిచిందని చెప్పారు. పల్లె ప్రజలకు తాగునీలు ఇవ్వడం తప్పా? బీడు భూములకు సాగునీలనివ్వడం నేరమా? రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అందించడం మోసమా ? అని ప్రశ్నించారు. దేశంలోని ఎక్కడలేని విధంగా రైతు సంక్షేమం కోసం, రైతు బాగు కోసం నిరంతరం శ్రమించి కాలేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన గొప్ప నేత, తెలంగాణ అపర భగీరథుడు కెసిఆర్ అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీని కాదని, రాజకీయ సిబిఐకి అప్పగించడం దేనికి నిదర్శనమో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేయించిన కమిటీ పైనే వాళ్లకు నమ్మకం లేదని, నివేదికలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విషయం తేలిపోవడంతో ఏం చేయాలో తోచక సిబిఐ కి అప్పగించారని, ఈ తరహా చర్యలు తెలంగాణ రైతంగాన్ని అవమానపరచడమేనని అభిప్రాయపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలకు కనీస అవగాహన లేదని, బ్యారేజీలు, కాలువలు, ఆయకట్టు, రిజర్వాయర్లు, తూములు, ఎత్తిపోత, టీఎంసీలు, క్యూసెక్కులు, వరద జలాలు, నిఖర జలాలు, మిగులు జలాలు, నదులపై తెలంగాణ హక్కు వంటి అంశాల పైన కాంగ్రెస్ నేతలకు కనీస జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ తత్వంలను తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని, సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు. నెల రోజుల నుంచి తెలంగాణ రైతులు ఎరువుల కోసం హరిగోస పడుతున్న కనీస చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ చూపని రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తారా? అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ సహకార యూనియన్ చైర్మన్ రాజవరప్రసాద్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, రాజ్యలక్ష్మి, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Comment