స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి,,
నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,,
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్, మండలం, హోతీ, ( బి) గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి సందర్భంగా హోతీ, బీ గ్రామంలో గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈరోజుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మహా నాయకుని కోల్పోయి 16 సంవత్సరాలు కాలం గడిచిపోయింది కానీ ఆ మహా నాయకుడు చేసిన సేవలు ఇప్పటికే ప్రజలు మరువలేని ఇక ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో స్వర్గీయ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ ఆర్,వందేళ్లు కలిసిన మరువ లేకుండా ఉంటారు ఆయన చేసిన సేవలు అంతో ఇంతో కాదు 2004వ సంవత్సరం కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి అన్ని వర్గాలకు పేద ప్రజలకు తమసుత న్యాయం చేస్తూ రైతు రాజ్యం తెచ్చి రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ తెచ్చి వందలాదిమందికి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించిన మహా నాయకుడు, ఇంతే కాకుండా ఇంద్రమ్మ పథకం తెచ్చి పేద ప్రజలకు ఇండ్లు పంచిన గొప్ప నేత, 108 ,102 లాంటి సేవలు కూడా తెచ్చింది వైయస్ ఆర్ ఇంతటితో ఆగకుండా ఆసరా పింఛన్ తెచ్చి, పేద ప్రజలకు ఆదుతున్నాడు దీంతో కూడా ఆగకుండా పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి రెండు రూపాయలకే ఇలా బియ్యం పంపిణీ చేశారు ఇవన్నీ పథకాలు కేవలం తెలుగు రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి దీనిపై ఆ రోజులలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన చించేలాగా అధికారంలోకి ఉన్న కూడా ప్రభుత్వ సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమంతో కార్యక్రమానికి వెళుతున్న సెప్టెంబర్ 2, 2009వ సంవత్సరంలో మహా నాయకుడు చివరి శ్వాస విడిచారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు అలాంటి నాయకుడు ఇక పుట్టలేడు అని యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బాధపడుతున్నారు ఇవన్నీ జరిగేయి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే వైయస్ ఆర్ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఎస్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ, మొహమ్మద్ వాజిద్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జాకీర్ పటేల్, సురేష్, మొహమ్మద్ అల్లావుద్దీన్, వెంకట్, అవినాష్, చాకలి కిష్టన్న, నర్సింలు, ఎస్ లక్ష్మారెడ్డి ,సాబీర్ పటేల్, కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Comment