×

ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించిన సీఐ రంగకృష్ణ 

 

ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ తూప్రాన్ సెప్టెంబర్ 1

 

తూప్రాన్ ముస్లిం మైనారిటీ సోదరులతో సి ఐ. రంగకృష్ణ సమావేశం నిర్వహించారు.రాబోయే మిలాద్-ఉన్-నబీ పండుగ వేడుకల గురించి సవివరంగా చర్చించారు.గణేష్ విగ్రహాల నిమజ్జనం అదే సమయంలో జరుగనున్న కారణంగా, ఇరు వేడుకలు శాంతియుతంగా మరియు సమన్వయంతో కొనసాగడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ముస్లిం సోదరులకు సెప్టెంబర్ 14న మిలాద్-ఉన్-నబీ జరుపుకోవాలని వినయపూర్వకంగా తెలియజేశారు . ముస్లిం సోదరులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించి పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. రెండు సమాజాల కార్యక్రమాలు సమన్వయంతో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌహార్ద వాతావరణంలో జరగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సిఐ రంగాకృష్ణ తెలిపారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!