టీ షర్ట్స పంపిణీ
క్రీడాకారులకు టీ షర్ట్స పంపిణీ
ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్.!
ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. సెప్టెంబర్, 01.
శివంపేట మండల కేంద్రంలోని రత్నాపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు క్రీడాకారులకు టీ షర్ట్స్ (స్పోర్ట్స్ దుస్తులు) కార్యక్రమాని ప్రముఖ సంఘ సేవకులు సేవ రత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్ క్రీడాకారులకు క్రీడ దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్,.బిజిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవ బండారి గంగాధర్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు టీ షర్ట్స్ స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ నిర్వహించారు.అలాగే ఇలాంటి కార్యక్రమం చేయడంలో ఎంతో సంతోషకరంగా భావించడం జరిగింది.క్రీడాకారులకు ప్రోత్సహిస్తే ఆటలు ఆడి జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో నేషనల్ స్థాయిలో ఆడి గెలిచి మంచి పేరు మీయొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క పాఠశాలకు చిరస్థాయిగా ఉండే విధంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి అన్నారు .అలాగే మీరు సంపాదించినటువంటి స్వీట్ మెమోరీస్ ఎప్పటికీ ఇలాగే నిలిచిపోయే విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అంటూ ఆయన ప్రసంగించడం జరిగింది. మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సహిస్తే మంచి ఆటలు ఆడి మీరు భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచి ఉండే విధంగా మీ యొక్క పాఠశాలకు మీ యొక్క గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని ఆమె ప్రసంగించడం జరిగింది.పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది కూడా విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క సహాయ సహకారాలు అందించి వాళ్లను పై స్థాయిలో చేరే విధంగా ప్రోత్సహించి వారికి సహకరించాలని ఆమె ప్రసంగించడం జరిగింది…
ఉన్నత పాఠశాల హెచ్ఎం బి.వేణుగోపాల్ రావు సార్ ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ ను మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిన్ రెడ్డి కి స్వాగతం పలుకుతూ ఈ యొక్క పాఠశాల వర్షం పడితే విద్యార్థులు ఉండలేని పరిస్థితికి చేరిందని విన్నపించడం జరిగింది. ఈ యొక్క పాఠశాలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి నూతన భవనాన్ని సాంక్షన్ చేయగలరని విజ్ఞప్తి చేశారు. అతిరథ భగీరథ మహారత నాయకులకు స్వాగతం పలుకుతూ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు శాలువాతోఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి. ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్. మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్. మాజీ ఎంపిటిసి జంగం వెంకటేష్. కొడకంచి శ్రీనివాస్ గౌడ్.రత్నాపూర్ మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్.ఎస్సీ సెల్ అధ్యక్షులు తిరుపతి రాథోడ్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి కిష్టయ్య. బండారి నగేష్. చిక్కుడు బాలేష్. రామ్మోహన్ రెడ్డి. నవపేట్ అశోక్.బి జి ఆర్ యువసేన అధ్యక్షుడు కుమ్మరి నాగరాజు. అడ్వకేట్ జనుముల గణేష్.బండారి సాయి కిరణ్. మన్నె శ్రీనివాస్. మహేష్.పిల్లుట్ల గ్రామ కమిటీ యూత్ అధ్యక్షుడు పిల్లి నరేష్. ఉన్నత పాఠశాల హెచ్ఎం.బి. వేణుగోపాలరావు సార్.ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు. విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post Comment