సకాలంలో యూరియా సరఫరా చేయాలని వినతి పత్రం!
జిల్లా వ్యవసాయ అధికారికి సకాలంలో యూరియా సరఫరా చేయాలని వినతి పత్రం!
శివంపేట పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి,రైతు రక్షణ సమితి నాయకులు!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. సెప్టెంబర్, 01.
శివ్వంపేట పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి, మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు యాద గౌడ్, గౌరవ అధ్యక్షులు మైసయ్య యాదవ్ , రైతుల తరపున యూరియా ఎరువు కొరత సమస్యపై వినతిపత్రం సమర్పించారు. రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ని కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి మండలానికి సరిపడా యూరియాని అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షులు అంతం గారి వెంకటేష్ కార్యదర్శి నరేందర్, రమేష్ యాదవ్, శ్రీకాంత్ ,మహేష్ యాదవ్, శివంపేట్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment