ముగ్గురు వ్యక్తుల అరెస్టు,,
మస్తాన్ కాలంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్టు,,
కే వినయ్ కుమార్ ఎస్సై,,
ప్రజా సింగిడి ప్రతినిధి, సెప్టెంబర్ 01 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్, పట్టణంలోని పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.15800/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, జహీరాబాద్ పట్టణంలోని మస్తాన్ కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రిత్య చర్య,తీసకుంటారని తెలిపారు.,
Post Comment