మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ లో అధికారుల మందు పార్టీ…
మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ లో అధికారుల మందు పార్టీ…
◆నీటి సరఫరా రాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..
◆కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్న అధికారులు.
◆నిలదీసిన స్థానికులు..
◆ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్..
◆చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
ప్రజా సింగిడి, సంగారెడ్డి/హత్నూర, సెప్టెంబర్ 1 :
హత్నూర మండలంలోని బోర్పట్ల మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం గ్రిడ్ కాంట్రాక్టు అధికారులు మందు పార్టీ చేసుకోవడంతో స్థానికులు వెళ్లి నిలదీశారు.
గత మూడు రోజులుగా హత్నూరతో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలో అనేక గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. బాధ్యత వహించాల్సిన అధికారులు మాత్రం కార్యాలయంలోనే మందు తాగుతూ పార్టీ చేసుకోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నించారు. గ్రామస్తులు అక్కడికే వెళ్లి అధికారులను నిలదీయగా, “సాయంత్రం తరువాత మందు తాగాం, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు” అంటూ మంజీర నీటి సరఫరా గ్రిడ్ కాంట్రాక్టు మేనేజర్ స్థానికుల సమక్షంలోనే ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్థానికులు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలకు తాగునీరు అందించాల్సిన మిషన్ భగీరథ కార్యాలయంలోనే మద్యం పార్టీలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Post Comment