భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు
ప్రజా సింగిడి సదాశివనగర్ఆగస్టు 24
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య హత్య కేసు ఛేదన
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను బండరాయితో హత్య చేసిన భర్త అరెస్ట్ మరియు రిమాండ్ కు తరలింపు శ్రీ యస్. శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి డిఎస్పి
సదాశివనగర్ గ్రామానికి చెందిన చిందం రవి (45) కుటుంబ కలహాల కారణంగా 22-08-2025 రాత్రి తన భార్య లక్ష్మి (40)పై బండరాయితో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్, 23-08-2025 ఉదయం ఇంటికి చేరుకొని తల్లి మృతదేహాన్ని గమనించి ఫిర్యాదు చేయడంతో, సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగినది.
ఎల్లారెడ్డి డిఎస్పి ఆదేశాల మేరకు, సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్ , ఎస్ హెచ్ ఓ మరియు సిబ్బంది కలిసి నిందితుడు చిందం రవిని గుర్తించి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ గొడవలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోపానికి లోనైన రవి తన భార్య లక్ష్మిని ఇంటి ముందు ఉన్న బండరాయితో తీవ్రంగా కొట్టి అతి దారుణంగా హత్య చేసినట్లు తేలింది.
స్వాధీనం చేసుకున్న వస్తువులు,
1. హత్యకు ఉపయోగించిన బండరాయి 2. నిందితుడు ధరించిన దుస్తులు
2. మొబైల్ ఫోన్
ఈ కేసును చాకచక్యంగా చేదించి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్న సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సంతోష్ కుమార్, ఎస్ఐ పుష్పరాజు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు అని ఎల్లారెడ్డి డిఎస్పి తెలిపారు
Post Comment