బాంసెఫ్ 12 వ రాష్ట్ర మహాసభల గడపత్రుల ఆవిష్కరణ
ప్రజా సింగిడి తాడ్వాయి ఆగస్టు 24
బాంసెఫ్ 12వ రాష్ట్ర మహాసభలను జయ ప్రదం చేయండి బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లీ రవితేజ
ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బాంసెఫ్ మరియు రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థిని విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మేధావులు తరలి రావాలిని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ కోరారు. తాడ్వాయి మండల కేంద్రంలో బాంసెఫ్ రాష్ట్ర మహసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఈ దేశంలోని అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి సంఘం బాంసెఫ్ అన్నారు.ఓబీసీ కుల జనగణన జరపాలని , ఈవీఎం మిషన్లను తొలగించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాడుతూ బహుజన సమాజాన్ని చైతన్యం చేస్తూ పూలే ,అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న సంఘం బాంసెఫ్ అన్నారు.బాంసెఫ్ రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో భారత్ ముక్తి మోర్చ కన్వీనర్ గడ్డం రవి, బిఎంఎం లింగం, బివిఎం తాడ్వాయి మండల కన్వీనర్ రోహిత్,
నర్సింలు,రోహిత్,అరుణ్,శ్రీధర్ ,స్వామి,నవీన్,సందీప్,భరత్ సవీన్,చరణ్
తదితరులు పాల్గొన్నారు
Post Comment